బ్రిడ్జిపై నిలబడి మూత్రం పోసిన వ్యక్తి... పర్యాటకులకు గాయాలు
బెర్లిన్‌లో ఓ విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. బ్రిడ్జిపై నిలబడి మూత్రం పోయడంతో అనేక మంది పర్యాటకులు గాయపడ్డారు. ఈ విచిత్ర ఘటనకు సంబంధించి మూత్రం పోసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. చివరకు అతనివద్ద విచారించగా, అతను మతిస్థిమితం లేని వ్యక్తిగా తేలింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఓ వంతెనపై నిల్చున్న వ్యక్తి జన్నోవిజ్ బ్రిడ్జి కింది నుంచి వెళుతున్న బోటుపై మూత్రం పోశాడు. ఈ మూత్రం తమపై పడకుండా తప్పించుకునేందుకు పర్యాటకులు ఒక్కసారిగా కిందికి దూకారు.
దీంతో వారి తలలు బోటుకు తాకడంతో బలమైన గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన నలుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న బెర్లిన్ అగ్నిమాపకశాఖ సిబ్బంది తెలిపారు. నీటిలోకి దూకిన మరికొందరు స్వల్పంగా గాయపడినట్టు పేర్కొన్నారు.
ఈ సంఘటనకు సంబంధించిన మూత్ర విసర్జన చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి మానసిక స్థితిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడికి సంబంధించిన పూర్తి వివరాలను ఆరా తీస్తున్నారు. ఈ ఫన్నీ సంఘటన బెర్లిన్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నవ్వు తెప్పించింది.