కోల్‌కతా జూనియర్ డాక్టర్ ఘటన.. సంజయ్‌కి మూడు పెళ్ళిళ్లు.. ప్రెగ్నెంట్‌గా వుంటే?
కోల్‌కతా జూనియర్ డాక్టర్ ఘటన ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారింది. యువతికి పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు బైటపడ్డాయి. ఘటన జరిగిన ప్రదేశంలో నిందితుడి ఉపయోగించే బ్లూటూత్ దొరకడంతో.. సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో నిందితుడు అత్త.. సంజయ్ రాయ్ గురించి సంచలన విషయాలు బైటపెట్టింది. సంజయ్ రాయ్ రెండో భార్య అత్త దుర్గాదేవీ మీడియాతో మాట్లాడుతూ.. తన అల్లుడి మీద ఫైర్ అయ్యారు. తన కూతురు పట్ల దారుణంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది.
అంతేకాకుండా ప్రతిరోజు తన కూతురికి వేధించేవాడని బాధపడింది. తన కూతురు మూడు నెలల ప్రెగ్నెంట్ ఉండగా.. ఇష్టమున్నట్లు కొట్టి, గాయపరిచాడని చెప్పింది. అతని దెబ్బలకు తన కూతురుకు గర్భస్రావం అయ్యిందని చెప్పుకొచ్చింది.
నిందితుడి మూడో భార్య ఇటీవల కొన్ని రోజుల క్రితం క్యాన్సర్ తో చనిపోయిందని చెప్పింది. ఇలాంటి తప్పులు చేసిన వారికి కఠినంగానే పనిష్మెంట్ ఇవ్వాలని, ఉరితీయాలని కూడా ఫైర్ అయ్యింది.