శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 23 మే 2018 (16:59 IST)

#KumaraswamySwearingIn ఇది కిచిడిలా వుంది.. ఎంతకాలం వుంటుందో?

కర్నాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత, మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ కుమారుడు కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మాయావతి, సోనియా గాంధీ, రాహు

కర్నాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత, మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ కుమారుడు కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మాయావతి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీతారాం ఏచూరి... తదితర నాయకులు పాల్గొన్నారు. దేశంలో భాజపా అక్రమాలను తరిమికొట్టాలని అంతకుముందు సమావేశమైన నాయకులు పిలుపునిచ్చారు.
 
ఒకవైపు కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తుండగానే భాజపా నాయకులు విమర్శనాస్త్రాలు సంధించారు. కర్నాటకలో జేడీఎస్ పోటీ చేసిన 218 స్థానాలకు గాను 180 చోట్ల దారుణంగా ఓడిపోయిందనీ, 147 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందనీ, కేవలం 38 స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీకి చెందిన కుమారస్వామి ముఖ్యమంత్రి కావడం దురదృష్టమంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ఈ అపవిత్ర పొత్తు ఎంతకాలం వుంటుందో మనమూ చూద్దామంటూ ఎద్దేవా చేస్తున్నారు.