సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 అక్టోబరు 2024 (21:32 IST)

ఆజా ఆజా అంటూ అరిచారు.. చిరుతకు చిర్రెత్తుకొచ్చింది.. అంతే? (video)

Tiger
Tiger
మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని షాదోల్ అటవీ ప్రాంతంలో చిరుతను రెచ్చగొట్టారు. అంతే చిరుతకు చిర్రెత్తుకొచ్చింది. అంతే పిక్నిక్‌కు వెళ్లిన వారికి చుక్కలు చూపించింది. వివరాల్లోకి వెళితే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని షాదోల్ అటవీ ప్రాంతంలో ఉన్న సోన్ న‌ది వ‌ద్ద‌కు కొంద‌రు ఫ్రెండ్స్ పిక్నిక్ వెళ్లారు. 
 
అక్క‌డి పొద‌ల్లో తిరుగుతున్న చిరుత‌ను చూశారు. వాళ్లు ఆ చిరుత‌ను రెచ్చ‌గొట్టారు. ఆజా ఆజా అంటూ అరిచారు. దీంతో ఆ చిరుత యువ‌కుల‌పై తిరుగ‌బ‌డింది. దాంట్లో ఓ యువ‌కుడు త‌న వ‌ద్ద ఉన్న మొబైల్ కెమెరాతో ఇదంతా చిత్రీక‌రించాడు. 
 
చిరుత ఓ వ్యక్తిపై దాడి చేసింది. దీంతో ఆ వ్యక్తికి గాయాలైనాయి. గుంపుగా వున్న ఆ యువకుల బృందం ఆ చిరుతను తరుముకోవడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.