గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 17 ఫిబ్రవరి 2018 (13:28 IST)

లక్నోలో చిరుత.. చుక్కలు చూపించింది.. వీడియో

అడవిలో వుండాల్సిన చిరుత గ్రామంలో వుంటే.. ఇంకేముంది..? ఆ గ్రామస్తులు రెండు రోజుల పాటు కంటి మీద కునుకు లేకుండా గడిపాల్సి వచ్చింది. యూపీ రాజధాని లక్నోలోని ఆషియానా కాలనీ ప్రజలకు చిరుత పులి చుక్కలు చూపించి

అడవిలో వుండాల్సిన చిరుత గ్రామంలో వుంటే.. ఇంకేముంది..? ఆ గ్రామస్తులు రెండు రోజుల పాటు కంటి మీద కునుకు లేకుండా గడిపాల్సి వచ్చింది. యూపీ రాజధాని లక్నోలోని ఆషియానా కాలనీ ప్రజలకు చిరుత పులి చుక్కలు చూపించింది. పులి గ్రామంలో తిరగడంతో ప్రజలు ఇంటి నుంచి బయటికి రావాలంటేనే జడుసుకున్నారు. ఇక అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 
 
అటవీ శాఖ సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేసినా.. చిరుతను పట్టుకోలేకపోయారు. ఇక లాభం లేదనుకున్న అధికారులు వలవేసి పట్టుకోవాలనుకున్నారు. ప్లాన్ ప్రకారం అదే చేశారు. కానీ ఆ వలలో చిక్కుకున్న పులి తప్పించుకుంది. చిరుతను ఫారెస్ట్ అధికారులు, గ్రామస్థులు తరుముతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.