శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 27 జూన్ 2020 (08:08 IST)

వచ్చే నెల 12 వరకు గౌహతిలో లాక్‌డౌన్

కరోనా వ్యాప్తిని తగ్గించడానికి అస్సాంలోని గౌహతిలో రెండు వారాల పాటు లాక్‌డౌన్ విధించారు. సోమవారం నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు ఈ లాక్‌డౌన్ కొనసాగనుంది.

అలాగే అస్సాం మొత్తం ఈ రెండు వారాలు రాత్రి పూట 7 గంటల నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ ఉంటుందని ఆ రాష్ట్ర సర్కార్ తెలిపింది. గౌహతి సిటీలో ఎలాంటి వాహనాల రాకపోకలను అనుమతించబోమని స్పష్టం చేసింది.

గ్రాసరీ స్టోర్స్, హాస్పిటల్స్, ఫార్మసీలు, బ్యాంకులు మాత్రమే తెరిచి ఉంటాయని తెలిపింది. 6,300 కరోనా కేసులతో ఈశాన్య రాష్ట్రాల్లో మహమ్మారి వల్ల ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రాల్లో ఒకటిగా అస్సాం ఉంది.

కరోనా బారిన పడి అస్సాంలో 9 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ నివేదికల ప్రకారం తెలుస్తోంది.