ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 డిశెంబరు 2021 (14:39 IST)

మృత్యువుతో పోరాటం : ఓడిపోయిన కెప్టెన్ వరుణ్ సింగ్

ఇటీవల తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కాట్టేరి ప్రాంతంలో రక్షణ శాఖకు చెందిన హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటనలో తీవ్రంగా గాయపడిన గ్రూపు కెప్టన్ వరుణ్ సింగ్ కన్నుమూశారు. ఎనిమిది రోజుల పాటు బెంగుళూరు ఆస్పత్రిలో మృత్యువుతోపోరాడి చివరకు బుధవారం ప్రాణాలు విడిచారు. 
 
ఈ నెల 8వ తేదీన జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్‌తో పాటు 13 మంది మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదంలో 80 శాతం కాలిన గాయాలతో ప్రాణాలతో బయటపడిన కెప్టెన్ వరుణ్ సింగ్‌ను తొలుత సులూర్ ఆర్మీ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ నుంచి బెంగుళూరులోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ఆయన కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షించారు. 
 
కానీ, ఆయన ఆరోగ్యం విషమించి బుధవారం తుదిశ్వాస విడిచారు. వరుణ్ సింగ్ మృతిపట్ల భారత వైమానిక దళ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వరుణ్ సింగ్ కుటుంబ సభ్యులకు సంతాపన తెలిపింది. వరుణ్ సింగ్ మృతితో ఈ హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 14కు చేరుకుంది. వరుణ్ సింగ్ సొంతూరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దేవరియా జిల్లా వాసి. కెప్టెన్ వరుణ్ సింగ్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు.