శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (12:44 IST)

ప్రేయసికి కొత్త కారు.. ఆపై దానిని 2వేల రూపాయలతో అలకరించాడు.. కానీ జైలుకెళ్లాడు..

ప్రేమికుల రోజున ఓ ప్రేమికుడు ప్రియురాలికి మదిలో నిలిచిపోయే కానుక ఇవ్వాలనుకుని అరెస్టయ్యాడు. తన ప్రియురాలి పట్ల తనకున్న అపారమైన ప్రేమను వాలంటైన్స్ డే వేళ వ్యక్తం చేయాలనుకున్న సదరు ప్రియుడు ఏకంగా తన కొత

ప్రేమికుల రోజున ఓ ప్రేమికుడు ప్రియురాలికి మదిలో నిలిచిపోయే కానుక ఇవ్వాలనుకుని అరెస్టయ్యాడు. తన ప్రియురాలి పట్ల తనకున్న అపారమైన ప్రేమను వాలంటైన్స్ డే వేళ వ్యక్తం చేయాలనుకున్న సదరు ప్రియుడు ఏకంగా తన కొత్త కారును రెండువేల రూపాయల నోట్లతో అలంకరించాడు. రెండువేల రూపాయల నోట్లు అలంకరించిన కారులో వెళ్లి ప్రియురాలిని కలుద్దామన్న ప్రియుడి కల ఫలించలేదు. 
 
అప్పటికే పోలీసులు అతనిని అరెస్ట్ చేయడంతో జైలు పాలయ్యాడు. ప్రియురాలిని కలిసేందుకు కారులో రోడ్డుపైకి వచ్చిన ప్రియుడిని ముంబయి పోలీసులు అరెస్టు చేసి, కరెన్సీ నోట్లు అలంకరించిన కారును స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద పోలీసులు జరిపిన విచారణలో ప్రియురాలి కోసమే ఇదంతా చేశానని.. కానీ ప్రియురాలిని కలుసుకోకముందే అరెస్ట్ కావడం బాధేసిందని చెప్పాడు.