సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 డిశెంబరు 2020 (17:53 IST)

ఐదు రోజుల్లో ఇద్దరు యువతులతో పెళ్లి.. ఆపై పరారీ..

ఐదు రోజుల్లో ఇద్దరు యువతులను పెళ్లి చేసుకుని పారిపోయాడు.. ఓ దుర్మార్గుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌‌కి చెందిన 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డిసెంబర్ 2న ఖాండ్వాలో ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. 
 
ఇది జరిగిన ఐదు రోజులకు అంటే డిసెంబర్ 7న మరో యువతిని వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యను ఇంట్లో ఉంచి వేరే పని ఉందని చెప్పి ఇండోర్‌లోని మోహోకి వెళ్ళి అక్కడ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
 
ఐతే ఈ రెండు పెళ్ళిళ్లకు వెళ్ళిన కామన్ బంధువు ఒకరు దీనిని గమనించి విషయం బయటపెట్టడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. దీనితో ఖండ్వా మహిళ కుటుంబం పోలీసులకి ఫిర్యాదు చేయడంతో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.