సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 జనవరి 2024 (13:31 IST)

మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. అశ్లీల చిత్రాలను చూడటం నేరం కాదు..

madras highcourt
మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అశ్లీల చిత్రాలను వ్యక్తిగతంగా చూడడం తప్పేమీ కాదంటూ మద్రాస్ హైకోర్టు తెలిపింది. మొబైల్ ఫోన్‌లో చిన్నారుల అశ్లీల చిత్రాలు డౌన్‌లోడ్ చేసి చూసినందుకు నమోదైన కేసును విచారించిన న్యాయస్థానం వ్యక్తిగతంగా అశ్లీల చిత్రాలు చూడడం నేరం కాదని స్పష్టం చేసింది. 
 
తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ అంబత్తూరుకు చెందిన యువకుడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. తాను చూసినవి చూసినవి పిల్లలకు సంబంధించినవి కావని కోర్టుకు తెలిపాడు. ఈ వ్యసనం నుంచి బయటపడేందుకు కౌన్సెలింగ్ తీసుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. వాదోపవాదాల అనంతరం ఈ కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.