శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 16 ఆగస్టు 2017 (14:01 IST)

'మహా' సీఎం ఫడ్నవిస్ భార్యా మజాకా... ఆమె షోకి టిక్కెట్ ధర రూ.51 వేలు

మహారాష్ట్ర ఫడ్నవీస్ సర్కార్ మరో వివాదంలో చిక్కుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి భార్య అమృతా ఫడ్నవిస్ బుధవారం సాయంత్రం ఔరంగాబాదులో జరుగనున్న 'పోలీస్ రజనీ' అనే కార్యక్రమంలో పాల్గొనబోతోంది. ఈ కార్యక్రమంలో ఆమె పాటలు పాడబోతోంది. ఐతే ఏంటటా అనుకునేరు... ఇక్కడే

మహారాష్ట్ర ఫడ్నవీస్ సర్కార్ మరో వివాదంలో చిక్కుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి భార్య అమృతా ఫడ్నవిస్ బుధవారం సాయంత్రం ఔరంగాబాదులో జరుగనున్న 'పోలీస్ రజనీ' అనే కార్యక్రమంలో పాల్గొనబోతోంది. ఈ కార్యక్రమంలో ఆమె పాటలు పాడబోతోంది. ఐతే ఏంటటా అనుకునేరు... ఇక్కడే వుందంతా. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఫడ్నవిస్ సర్కారు వివాదాస్పద నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 
 
ఈ ఈవెంటును వీక్షించడం ఉచితం కాదు... టికెట్ ధర రూ.51 వేలు. మరి అంత ధరను చెల్లించి ఈ కార్యక్రమాన్ని ఎవరు చూస్తారు అనుకుంటున్నారా... అందుకే ఆ పనిని పోలీసులకు అప్పగించారట. దాంతో ఔరంగాబాద్ పోలీసులు రంగంలోకి దిగి... కాస్త డబ్బున్న ఫ్యామిలీలను పట్టుకుని బలవంతంగా వారి చేత టిక్కెట్లు కొనుగోలు చేయిస్తున్నారట. ఈ వ్యవహారం కాస్తా బయటపడటంతో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. 
 
దీనిపై విచారణ చేయించాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు టిక్కెట్లను బలవంతంగా కొనుగోలు చేయిస్తున్నారా అని పోలీసులను అడిగితే మా పైఅధికారుల సూచనల మేరకు తాము నడుస్తున్నామని చెపుతున్నారట. పైఅధికారులకు ఫోన్ చేసి విషయం ఏంటని అడిగితే... రాంగ్ నంబర్ అని ఫోన్లు పెట్టేస్తున్నారట. మొత్తమ్మీద సీఎం భార్య ప్రోగ్రామ్ ముచ్చట ఈవిధంగా తయారైంది.