గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 జనవరి 2022 (11:36 IST)

నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి... నేతల నివాళులు

జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి వేడుకలు జనవరి 30వ తేదీన దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. సత్యం, అహింస మార్గాలే తన ఆయుధాలుగా ఎన్నుకుని బ్రిటీష్ పాలకులపై తిరుగుబాటు చేసిన మహోన్నత వ్యక్తి మన జాతిపిత. బ్రిటీష్ సామాజ్య పాలన నుంచి భారత్‌కు విముక్తి కలిగించిన నేత. ఈయన 74వ వర్థంతి వేడుకలు ఆదివారం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయనకు యావత్ భారతావని నివాళులు అర్పిస్తుంది. 
 
"అహింసే అత్యున్నత కర్తవ్యం. మనం దాన్ని పూర్తిస్థాయిలో సాధన చేయలేక పోయినా, దాన్ని గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మానవతా దృక్పథంతో హింసామార్గం నుంచి సాధ్యమైనత వరకు దూరంగా ఉండాలి" అంటూ మహాత్మా గాంధీ యావత్ ప్రజలకు అమూల్యమైన సందేశం ఇచ్చారు. 
 
గాంధీ వర్థంతి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంటరానితనంకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞలు చేశారు. 
 
కాగా, "సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి భారతీయులకు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు అందించిన జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు" అంటూ టీడీపీ నేత దేవినేని ఉమ ట్వీట్ చేశారు.