గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 జనవరి 2022 (10:26 IST)

దేశంలో తగ్గుతున్న కరోనా తీవ్రత - నేడు 2.51 లక్షల కేసులు

దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఈ కేసుల సంఖ్యను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. గురువారం వెల్లడించిన గణాంకాల మేరకు దేశంలో 2.86 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ, గడిచిన 24 గంటల్లో ఈ కేసుల సంఖ్య 2,51,209కు తగ్గాయి. అదేవిధంగా ఈ వైరస్ వల్ల 627 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇకపోతే, కరోనా నుంచి మరో 3,47,443 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో దేశ వ్యాప్తంగా 21,05,611 మంది చికిత్స తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 1,64,44,73,216 మందికి కరోనా వ్యాక్సిన్ డోస్‌లు వేశారు.