శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 జనవరి 2022 (19:13 IST)

ఆంధ్రప్రదేశ్‌లో తగ్గేదేలే అంటున్న కరోనా వైరస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. కోవిడ్ టెస్టుల సంఖ్య తగ్గించినప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 49143 మందికి కోవిడ్ టెస్టులు చేయగా, 13618 మందికి ఈ వైరస్ సోకింది. 
 
అలాగే, తొమ్మిది మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖలో ఇద్దరి చొప్పున, చిత్తూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అలాగే, మరో 8687 మంది కోలుకున్నారు. 
 
తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా విశాఖపట్టణంలో 1791, అనంతపురంలో 1650, గుంటూరులో 1464, కర్నూలులో 1409, ప్రకాశంలో 1295 చొప్పు పాజిటివ్ కేసులు వెలుగు చూపాయి.