సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 డిశెంబరు 2021 (08:15 IST)

గురితప్పని 'ప్రళయ్' క్షిపణి - కలాం తీరం నుంచి ప్రయోగం సక్సెస్

భారత రక్షణ పరిశోధనా సంస్థ (డీఆర్డీవో) మరో క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించగల, దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రళయ్ మిస్సైల్‌ను ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి ప్రయోగించింది. 
 
'ఈ ప్రయోగంతో అన్ని లక్ష్యాలు నెరవేరాయి. కొత్త క్షిపణి ఆశించిన రీతిలో పాక్షిక క్షిపణి పథాన్ని (క్వాసి బాలిస్టిక్ ట్రాజెక్టరీ) అనుసరించింది. నిర్దేశిత లక్ష్యాన్ని ఖచ్చితమైన వేగంతో చేరుకుంది. అన్ని ఉప వ్యవస్థలు సంతృప్తికరంగా చేరాయి' అని డీఆర్డీవో ఓ పత్రిరా ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, కొత్తగా ప్రయోగించిన క్షిపణి 150 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. క్వాసి మిస్సైల్ ట్రాజెక్టరీ కూడా బాలిస్టిక్ క్షిపణి పథంగానే ఉంటుందని తెలిపింది. ఆధునిక పరిజ్ఞానంతో కూడిన ఈ కొత్త క్షిపణి కొత్త తరం క్షిపణి అని డీఆర్డీవో ఛైర్మన్, రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ జి.సతీష్ రెడ్డి అన్నారు.
 
ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  కూడా డీఆర్డీవో, శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. "క్వాజీ బాలిస్టిక్ మిస్సైల్‌ను వేగంగా అభివృద్ధి చేసినందుకు నా అభినందనలు. ఇది కీలకమైన మైలురాయి'' అంటూ ట్వీట్ చేశారు.