గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 డిశెంబరు 2016 (09:41 IST)

'నేను నేలపై నిద్రిస్తా.. ఆమె చిన్న ఇంట్లో ఉంటారు'.. మమతను శంకించొద్దు... రాందేవ్ బాబా

వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రముఖ యోగాగురువు బాబా రాందేవ్ బాబా సునిశిత విమర్శలు చేశారు. దేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కనిపించినా వాస్తవానికి ఆమె మనసులో కేంద్

వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రముఖ యోగాగురువు బాబా రాందేవ్ బాబా సునిశిత విమర్శలు చేశారు. దేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కనిపించినా వాస్తవానికి ఆమె మనసులో కేంద్రం తీసుకున్నది మంచినిర్ణయంగానే ఆమె భావిస్తోందని రాందేవ్ బాబా అన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ.. నిజానికి పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మమతా బెనర్జీ అం‍గీకరించారని, కానీ, దాని అమలు విధానాన్ని మాత్రమే ఆమె వ్యతిరేకిస్తున్నట్లుగా అనిపిస్తోందని చెప్పారు. నల్లధనం దేశంపై చెడు ప్రభావాన్ని చూపుతుందనే విషయాన్ని మమత కూడా అంగీకరించిందని అన్నారు. 'పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అమలు చేస్తున్న తీరునే ఆమె వ్యతిరేకిస్తున్నారని నాకనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్య దేశం. విమర్శించేందుకు ప్రతి ఒక్కరికీ హక్కుంది' అని అన్నారు. 
 
అలాగే, మమతా చాలా సాధరణమైన జీవితం గడుపుతారని ప్రశంసించారు. 'నేను నేలపై పడుకుంటాను. ఆమె చిన్న ఇంట్లో నివసిస్తారు. హవాయ్‌ చెప్పులు వేసుకుంటారు. ఆమె ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేకంగా ఏ ఒక్కరూ అనుమానించాల్సిన పనిలేదు. మావోయిస్టులకు, ఉగ్రవాదులకు నల్లడబ్బు ద్వారానే నిధులు అందుతున్నాయనే విషయాన్ని ఆమె కూడా అంగీకరించారు' అని రాందేవ్ బాబా చెప్పుకొచ్చారు.