ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 14 జూన్ 2017 (17:17 IST)

సీటు ఇప్పిస్తానని.. కదిలే రైలులో క్యాటరింగ్ రూమ్‌లో అత్యాచారం చేసిన రైల్వే ఉద్యోగి..

కదిలే రైలులో 32 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఓ రైల్వే ఉద్యోగి. ఎక్స్‌ప్రెస్ రైలులో సీటు ఇప్పిస్తానని నమ్మించిన రైల్వే ఉద్యోగి ఆ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే.. ఘాజియాబ

కదిలే రైలులో 32 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఓ రైల్వే ఉద్యోగి. ఎక్స్‌ప్రెస్ రైలులో సీటు ఇప్పిస్తానని నమ్మించిన రైల్వే ఉద్యోగి ఆ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే.. ఘాజియాబాద్‌కు చెందిన 32 ఏళ్ల వివాహిత.. స్నేహితురాలితో కలిసి బాంద్రా-జైపూర్ అరవాళి ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణానికి బయల్దేరింది. కానీ  రైలులో ఒక్క సీటు మాత్రమే చిక్కింది. 
 
ఇక లాభం లేదనుకుని ఆ మహిళలు రైలు ఎక్కేశారు. ఒకరికి సీటు చిక్కడంతో 32 ఏళ్ల మహిళ మాత్రం నిలబడి ప్రయాణం కొనసాగించింది. ఆ సమయంలో అటువైపు క్యాటరింగ్ కోసం వెళ్లే రైల్వే ఉద్యోగి అజహర్ ఖాన్‌ను 32 ఏళ్ల మహిళ సీటు ఇప్పించమని అడిగింది. ఓస్ అంతేనా అంటూ అజహర్ ఖాన్ అటూ ఇటూ తిరిగి నానా హంగామా చేశాడు. అతని హంగామా చూస్తుంటే నిజంగా తనకు సీటు చిక్కినట్లేనని ఆమె భ్రమపడిపోయింది. 
 
రైలు వేగంగా వెళ్తున్న సమయంలో అజహర్ ఖాన్ 32 ఏళ్ల మహిళకు ఫోన్ చేసి సీటు చిక్కింది రావాలన్నాడు. ఆ మహిళ అతని దగ్గరకు వెళ్లిన తర్వాత  కామాంధుడు ఆమెను క్యాటరింగ్ సామాగ్రి ఉండే చిన్నగదిలోకి లాక్కెళ్లాడు. తరువాత ఆమె మీద అత్యాచారం చేశాడు. కేకలు వేసినా విషయం బయటకు చెప్పినా రైలులో నుంచి కిందకు తోసేస్తానని హెచ్చరించారు. 
 
కదులుతున్న రైలులో అజహర్ ఖాన్‌పై ఫిర్యాదు చేస్తే.. ప్రాణాలకు ముప్పు తప్పదనుకుని జడుసుకున్న ఆమె.. రైలు జైపూర్ రైల్వే స్టేషన్ చేరుకోగానే బాధితురాలు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు అజహర్ ఖాన్‌ను అరెస్టు చేశారు.