శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 ఏప్రియల్ 2021 (15:47 IST)

కన్నబిడ్డ పురిటి నొప్పుల కోసం వస్తే.. ఆశాకార్యకర్తపై అత్యాచారయత్నం

కామాంధుల దుశ్చర్యలు ఆగట్లేదు. కన్నబిడ్డ పురిటి నొప్పుల కోసం వస్తే ఆమెకు సహకరించిన ఆశా కార్యకర్తపై అకృత్యానికి యత్నించాడు. ప్రసవం కోసం మహిళను ఆస్పత్రికి తీసుకొచ్చిన ఆశా కార్యకర్తపై గర్భిణి తండ్రి అత్యాచారానికి ప్రయత్నించాడు. 
 
ఈ ఘటన గంగావతిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కనకగిరి తాలూకాలోని బసిరిహళ్‌ గ్రామానికి చెందిన ఒక మహిళకు ప్రసవ నొప్పులు రావడంతో ఈనెల 16న ఆశా కార్యకర్త ఆమెను గంగావతి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చింది.
 
కాన్పు కష్టంగా మారడంతో నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. రాత్రి పొద్దుపోవడంతో ఆశా కార్యకర్త ఓ గదిలో నిద్రించింది. ఇదే అదునుగా గర్భిణి తండ్రి బాలప్ప(59) ఆశాకార్యకర్తపై అత్యాచారానికి యత్నించాడు. అర్దరాత్రి నిద్రపోతున్న ఆశా కార్యకర్త దగ్గరకు వెళ్లిన బాలప్ప అతని చేతిలో ఉన్న టవల్ తీసుకుని ఆశా కార్యకర్త నోట్లు కుక్కాడు. 
 
ఆశా కార్యకర్త కేకలు వెయ్యకుండా చేసిన బాలప్ప ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఆశా కార్యకర్త మీద అత్యాచారం చెయ్యడానికి విఫలయత్పం చేశాడు. ఆ సమయంలో ఆశా కార్యకర్త ఎదురుతిరిగి నోట్లు ఉన్న టవల్ బయటకు లాగేసి గట్టిగా కేకలు వేసింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ ఆస్పత్రికి చేరుకొని బాలప్పను అరెస్ట్‌ చేశారు.