సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 ఏప్రియల్ 2023 (11:27 IST)

ఢిల్లీ మెట్రో రైలులో పళ్లు తోముకుంటూ కెమెరాకు చిక్కాడు

Metro
Metro
ఢిల్లీ మెట్రో రైలులో ఉదయం ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి నమ్మకంగా పళ్లు తోముకుంటూ కెమెరాకు చిక్కాడు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా పాపులర్ అయ్యింది. ఈ వీడియోకు నెటిజన్ల నుండి విపరీతమైన స్పందనలు వస్తున్నాయి. 
 
కొంతమంది సదరు విచిత్రమైన ప్రవర్తనకు థంబ్స్ అప్ ఇస్తున్నారు. మరికొందరు ప్రాథమిక పరిశుభ్రత, మర్యాదలను విస్మరించినందుకు అతనికి థంబ్స్ డౌన్ ఇస్తున్నారు. తరచూ ఢిల్లీ మెట్రో ఇలాంటి ఘటనలతో వార్తల్లో నిలుస్తోంది.