శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (23:29 IST)

మెట్రో స్టేషన్‌లో పట్టాలపై పడిపోయిన వ్యక్తి.. (వీడియో)

చేతిలో స్మార్ట్ ఫోన్ వుంటే లోకాన్ని మరిచిపోయే వ్యక్తుల సంఖ్య పెరిగిపోతోంది. అలా మెట్రో రైల్వే స్టేషన్‌లో వున్న ఓ వ్యక్తి ఫోన్‌లో బిజీగా గడుపుతూ.. రైలు పట్టాలపై పడిపోయాడు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సభ్యుడు ఢిల్లీలోని షహదారా మెట్రో స్టేషన్‌లో పట్టాలపై పడిపోయిన ప్రయాణికుడిని రక్షించడం ద్వారా విపత్తును నివారించాడు. 
 
CISF తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన వీడియో ప్రకారం, ప్లాట్‌ఫారమ్ నుండి ట్రాక్‌లపై పడిపోయినప్పుడు ప్రయాణీకుడు తన ఫోన్‌లో మాట్లాడుతూ ఉన్నట్లు అనిపించింది. అలా ఫోన్ చూస్తూ ఓ ప్రయాణీకుడు పట్టాలపై పడిపోయాడు. 
 
వెంటనే స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడారు. సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది వేగంగా స్పందించినందుకు నెటిజన్లు ప్రశంసలు కురిపించగా, కొందరు ఆ వ్యక్తి తన ఫోన్‌ను ఉపయోగించడంలో బాధ్యతారాహిత్యాన్ని విమర్శించారు. దీనికి సంబంధించిన చిన్న వీడియో వైరల్‌గా మారింది.