శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (22:51 IST)

ప్రీలోడెడ్ యాప్ రూపంలో ట్రూ కాలర్..

కొత్త ఫోన్లలో ఇకపై ప్రీలోడెడ్ యాప్ రూపంలో ట్రూ కాలర్ యాప్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు పలు ఆండ్రాయిడ్ ఫోన్ తయారీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ట్రూ కాలర్ వర్గాల సమాచారం. 
 
అయితే, ప్రీలోడెడ్‌గా తమ యాప్ అందుబాటులోకి వచ్చినప్పటికీ, దాన్ని ఉపయోగించాలా? వద్దా? అనేది యూజర్ నిర్ణయించుకోవచ్చని ట్రూ కాలర్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది ఫోన్లలో ప్రీలోడెడ్ యాప్‌గా సేవలు అందించాలని ట్రూ కాలర్ తెలిపింది. 
 
ఇకపోతే.. స్మార్ట్ ఫోన్లు ఉపయోగించే వారికి ట్రూకాలర్ గురించి బాగానే తెలుసు. ఏదైనా కొత్త నెంబరు నుంచి కాల్ వస్తే, ఈ యాప్ ద్వారా ఆ నెంబరు ఎవరిదో తెలుసుకోవచ్చుననేది అందిరికీ తెలిసిందే.