సోఫాపై నిద్రిస్తున్న మహిళను అక్కడ తడుముతూ.. సీసీటీవీకి చిక్కాడు..
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ మహిళలను వేధించేందుకు కామాంధులు సిద్ధంగా వున్నారు. ఇంటా బయటా మహిళలను వేధించే వారి సంఖ్య ఎక్కువవుతోంది.
తాజాగా అపార్ట్‌మెంట్‌లో నిద్రిస్తున్న మహిళను ఓ వ్యక్తి వేధించాడు. సోఫాపై హాయిగా నిద్రపోతున్న మహిళను ఓ వ్యక్తి వేధించిన ఘటన అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మహిళల కోసం పేయింగ్ గెస్ట్ సర్వీస్ చేస్తున్న అపార్ట్‌మెంట్‌లో క్లీనర్‌గా పనిచేస్తున్న మహిళ.. గెస్ట్ కోసం వేచి చూస్తూ.. డోర్ లాక్ చేయకుండా అలానే నిద్రించింది.
దీన్ని అదనుగా తీసుకున్న ఫుడ్ డెలివరీ బాయ్ భావిన్ షా.. సోఫాపై నిద్రిస్తున్న మహిళను తాకుతూ సీసీటీవీ కెమెరాకు చిక్కాడు. జూన్ 14వ తేదీ అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
డ్రాయింగ్ రూమ్‌లో నిద్రిస్తున్న మహిళ శరీర భాగాలను తడుముతూ... పిరుదులను నొక్కుతూ కనిపించాడని పోలీసులు తెలిపారు. అయితే అలారం అలెర్ట్ చేయడంతో తప్పించుకునేందుకు అతడు ప్రయత్నించాడని.. ఇంతలో దొరికిపోయాడని పోలీసులు వివరించారు. ఇప్పటికే 354, 452 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు వెల్లడించారు.