గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2023 (16:11 IST)

వదినపై మోజు.. అడ్డుగా బిడ్డ.. ఏం చేశాడంటే?

crime
వదినపై మోజుతో అడ్డుగా వున్న బిడ్డను పొట్టన బెట్టుకున్నాడు ఓ దుండగుడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కల్లకురిచ్చిలో స్పీకర్ బాక్సులో ఓ చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు.  కళ్లకుర్చిలో ఉన్న తిరుపాలపందల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న గురుమూర్తి - జగదీశ్వరి దంపతుల రెండేళ్ల ఏళ్ల మగ బిడ్డ ఇటీవల కనిపించకుండా పోయాడు. దీంతో రెండేళ్ల చిన్నారి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 
ఈ సమయంలో ఇంట్లో ఉన్న స్పీకర్ బాక్స్‌లో చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆపై  గురుమూర్తి బంధువులను విచారిస్తున్నారు. ఆ సమయంలోనే గురుమూర్తి సోదరుడు రాజేశ్ అదృశ్యమైన సంగతి తెలియవచ్చింది. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రాజేష్ వద్ద జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
రాజేష్‌కు తన అన్నయ్య గురుమూర్తి భార్యయైన జగదీశ్వరిపై మోజు వుండేదని.. ఆమెను ఎన్నో సార్లు వేధింపులకు గురిచేశాడని తెలియవచ్చింది. రెండేళ్ల బాబు పుట్టడం వల్లే జగదీశ్వరి తన కోరికను తీర్చలేదనే ఉద్దేశంతో ఆ బిడ్డను చంపేసినట్లు అంగీకరించాడు. ఆపై బిడ్డ మృతదేహాన్ని స్పీకర్ బాక్సులో ఉంచారు రాజేష్. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.