గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 జనవరి 2018 (12:31 IST)

2 గంటల్లో కనిపించిన వాళ్లను కనిపించినట్లు ఆరుగురిని చంపేశాడు.. ఎక్కడ?

హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మతిస్థిమితంలేని వ్యక్తి చేతిలో ఇనుపరాడ్డు పట్టుకుని కంటికి కనిపించిన వాళ్లను కనిపించినట్టు చంపేశాడు. అదీ కూడా కేవలం 2 గంటల్లో ఆరుగురిని చంపేశాడు.

హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మతిస్థిమితంలేని వ్యక్తి చేతిలో ఇనుపరాడ్డు పట్టుకుని కంటికి కనిపించిన వాళ్లను కనిపించినట్టు చంపేశాడు. అదీ కూడా కేవలం 2 గంటల్లో ఆరుగురిని చంపేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆ దండగుడిని అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
దేశరాజధానికి 80 కిలోమీటర్ల దూరంలోని హర్యానా రాష్ట్రం, పాల్వాల్‌ అనే ఏరియాలో ఓ మతిస్థిమితం లేని వ్యక్తి చేతిలో రాడ్డు పట్టుకుని తిరుగుతూ కనిపించిన వాళ్లను కనిపించినట్లు హతమార్చాడు. ఇలా ఆరుగురుని చంపేశాడు. ఈ ఆరు హత్యలూ మంగళవారం రాత్రి 2 నుంచి 4 గంటల మధ్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. 
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ అధారంగా నిందితుడిని ఆదర్శ్‌నగర్‌ ప్రాంతంలో పట్టుకున్నారు. నీలం రంగు స్వెటర్, తెలుపు రంగు ప్యాంటు వేసుకుని ఆసుపత్రి ఆవరణలోకి వెళుతున్న దృశ్యాలు ఉదయం 2.30 గంటల సమయంలో రికార్డు అయ్యాయని, ఆ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నామన్నారు. 
 
దీనిపై పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. నిందితుడు మొదట ఆగ్రా రోడ్డు-మినార్ గేట్ మధ్యలో నలుగురిని హతమార్చాడని, ఆ తర్వాత ఒక సెక్యురిటీ గార్డును ఇనుపరాడ్డుతో కొట్టి ఆసుపత్రి వైపు వెళ్లాడని, అక్కడ ఓ మహిళపై దాడి చేశాడని చెప్పారు. అతడు దాడి చేసిన ఆరుగురూ ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. అతన్ని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై కూడా రాడ్డుతో దాడి చేసినట్టు తెలిపారు.