సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 ఆగస్టు 2023 (15:59 IST)

కూతురిని భుజాలపై ఎత్తుకుని నడిచాడు.. తుపాకీతో కాల్చేశాడు..

gun shot
యూపీలో కాల్పుల ఘటన సంచలనం రేపింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. తన చిన్నారి కూతురిని భుజాలపై ఎత్తుకుని నడుచుకుంటూ వెళ్లిన వ్యక్తిని కొందరు దుండగులు దగ్గరి నుంచి కాల్చారు. 
 
ఈ ఘటనలో చిన్నారి క్షేమంగా బయటపడగా, ఆ వ్యక్తి పరిస్థితి మాత్రం విషమంగా వున్నట్లు తెలుస్తోంది. దాడికి పాత కక్షలే కారణమని పోలీసులు చెప్తున్నారు. 
 
యూపీలోని షాజహాన్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.