సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 ఆగస్టు 2023 (12:39 IST)

దొంగకు చుక్కలు చూపించిన వృద్ధురాలు.. నెటిజన్ల ప్రశంసలు

robbery
వేములవాడలో ఓ దొంగకు ఓ వృద్ధురాలు చుక్కలు చూపించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గల భగవంతరావు నగర్‌లోని తన ఇంటిలోకి చొరబడేందుకు ప్రయత్నించిన దొంగకు వృద్ధురాలు చుక్కలు చూపించింది. 
 
ఆదివారం నాడు జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వృద్ధురాలి సాహసాన్ని పలువురు నెటిజన్లు కొనియాడుతున్నారు. 
 
ఆ వీడియోలో దొంగతో మహిళ నువ్వానేనా అన్నట్లు పోటీకి దిగింది. దొంగ ఆయుధాలతో బెదిరించినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఫలితంగా తన ఇంట్లోకి దొంగను ప్రవేశించకుండా అడ్డుకుంది. 
 
అంతేగాకుండా ఇరుగుపొరుగు వారు కూడా ఆ వృద్ధురాలి పోరాటానికి తోడు కావడంతో ఆ దొంగ పారిపోయాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ దొంగ ఇక జన్మలో దొంగతనం చేయకూడదనే ఆలోచనకు వచ్చివుంటాడని కామెంట్లు చేస్తున్నారు.