దొంగతనం కోసం వచ్చి.. ఫోన్ మరిచిపోయాడు.. చివరికి ?
దొంగతనం కోసం వచ్చి.. ఇంట్లోకి చొరబడి చేతికి అందినదంతా దోచుకున్నాడు. ఇంతలో దొంగతనం కోసం వచ్చిన అతడు ఫోన్ చూస్తూ బ్యాటరీ తగ్గింది. అక్కడే టేబుల్‌పై చార్జర్ గమనించాడు. ఫోన్ ఛార్జింగ్ పెట్టి చోరీకి పాల్పడ్డాడు. ఇంతలో ఇంటి యజమాని ఎంట్రీ ఇవ్వడంతో దొంగ మెల్లగా అక్కడి నుంచి పరారయ్యడు.
అయితే తన ఫోన్ చార్జింగ్ పెట్టింది మర్చిపోయి వెళ్లిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువులో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు పట్టణంలోని సాయిరాం కాలనీలో కమాలుద్దీన్ అనే వ్యక్తి ఇంట్లో ఈ చోరీ జరిగింది.
కుటుంబ సభ్యులు లేని సమయంలో ఇద్దరు దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. ఫోన్‌లో ఛార్జింగ్ పెట్టుకుని ఫోన్ మరిచివెళ్లిపోయారు. ఇంటిని పగులగొట్టి 12 తులాల బంగారం, 69 తులాల వెండి, రూ.24 వేలు నగదు అపహరించారు. ఇక దొంగలు మరిచిన సెల్ ఫోన్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.