సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 ఆగస్టు 2023 (14:28 IST)

రీ-ఎంట్రీకి రెడీ అవుతున్న రిషబ్ పంత్.. బీసీసీఐ మాత్రం?

rishab panth
2024 వచ్చే ఏడాది జరగనున్న ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ నుంచి రిషబ్‌ పంత్‌కు మళ్లీ జట్టులో అవకాశం కల్పించాలని బీసీసీఐ భావిస్తోంది. అన్నీ సరిగ్గా జరిగితే, పంత్ జనవరి 2024లో తిరిగి జట్టులోకి వస్తాడు.

దీంతో ఈ ఏడాది రిషబ్ పంత్ క్రికెట్‌ మైదానంలోకి వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ ప్రస్తుతం మెల్ల మెల్లగా కోలుకుంటున్న సంగతి తెలిసిందే. 
 
పూర్తిగా కోలుకున్నప్పటికీ బీసీసీఐ మాత్రం పంత్ పునరాగమనంపై తొందరపడాలని కోరుకోవడం లేదు. పంత్‌కు పూర్తిగా కోలుకునే సమయం ఇవ్వాలని కోరుకుంటోంది. రిషబ్ పంత్ ఇప్పుడు మునుపటిలా బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు.