గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జెఎస్కె
Last Updated : శనివారం, 24 జులై 2021 (16:33 IST)

మంగుళూరు-ముంబై ట్రైన్ యాక్సిడెంట్ దృశ్యాలు చూస్తే...

మంగుళూరు-ముంబై ట్రైన్ యాక్సిడెంట్ దృశ్యాలు చూస్తే...ఎవరికైనా గుండెల్లో రైళ్ళు ప‌రుగెడ‌తాయి. ఇంత జ‌రిగినా ఒక్క‌రి ప్రాణం కూడా పోక‌పోవ‌డం చాలా అదృష్ట‌మ‌నే చెప్పాలి. అంత‌లా ఉన్నాయి ఈ యాక్సిడెంట్ దృశ్యాలు.
 
గోవా-కర్ణాటక బోర్డర్ లోని ప్రఖ్యాత దూద్​సాగర్ జలపాతం దగ్గర ఈ ఎక్స్​ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. భారీ వర్షాల కారణంగా రైలు పట్టాలపై కొండ చరియలు విరిగి పడడంతో మంగళూరు నుంచి ముంబయి వెళ్తున్న రైలు (01134) సోనాలిమ్- దూద్​సాగర్ స్టేషన్ల మధ్య ప్రమాదానికి గురైంది. రైలు ఇంజిన్, మొదటి జనరల్ బోగీ పట్టాలు తప్పింది.

అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగ లేదని సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారులు తెలిపారు. పట్టాలు తప్పిన బోగీల్లోని ప్రయాణికులను వెంటనే వేరే బోగోల్లోకి తరలించారు. అదే సమయంలో దూద్​సాగర్-కరన్ జోల్ రైల్వే స్టేషన్ల మధ్య కూడా పట్టాలపై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో మంగళూరు-ముంబై రైలుని రూట్  మార్చి  తిరిగి కులెమ్ రైల్వే స్టేషన్ కి తీసుకెళ్లారు.