సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 4 మార్చి 2021 (20:47 IST)

పెళ్ళయిన తరువాత ప్రేమించింది, ప్రియుడు దూరమైపోతాడని?

పెళ్ళయ్యింది. ఇంకా పిల్లలు లేరు. అయితే పెళ్ళయిన తరువాత ఆమెకు మరో యువకుడితో ప్రేమ కలిగింది. అది కూడా గాఢ ప్రేమ. విడిపోలేనంతగా ప్రేమ కలిగింది. ఆ ప్రేమతో ఇద్దరూ కలిసి ఉండాలనుకున్నారు. కానీ చివరకు ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా మల్లూరు ప్రాంతానికి చెందిన క్రిష్ణన్ తండ్రి, అన్నతో కలిసి నామక్కల్ జిల్లా ముత్తుకాపట్టిలో నివాసముండేవారు. ఇటుక బట్టీలో వీరు ముగ్గురు పనిచేసుకుని జీవనం సాగిస్తున్నారు. క్రిష్ణన్ అన్న శంకర్ కు పెళ్ళయ్యింది.
 
క్రిష్ణన్‌కు ఇంకా వివాహం కాలేదు. అదే ఇటుక బట్టీలో పనిచేసే భాస్కర్ భార్యతో క్రిష్ణన్‌కు పరిచయం ఏర్పడింది. క్రిష్ణన్ కన్నా ఆ యువతి జ్యోతినే ఎక్కువగా ఇతన్ని ప్రేమించింది. అతని మాటలు.. నడవడిక బాగా నచ్చింది. తన భర్త కన్నా సున్నితంగా క్రిష్ణన్ ఉండటంతో అతనికి సర్వస్వం అప్పగించింది.
 
ఇద్దరూ శారీరకంగా బాగా దగ్గరయ్యారు. అయితే ఇది రెండునెలల నుంచి సాగుతోంది. విషయం కాస్త భాస్కర్‌కు తెలిసింది. ప్రియుడితోనే కలిసి ఉండాలనుకుంది. ఇంట్లో నుంచి పారిపోయారు. కానీ వీరి వల్ల రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుసుకుని మనస్థాపానికి గురైంది జ్యోతి.
 
ప్రియుడితో లేని జీవితం వద్దనుకుంది. భర్తతో వెళ్ళాలనుకోలేదు. ప్రియుడిని ఒప్పించింది. ఊరు చివరలో చెట్టుకు ఇద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తాను క్రిష్ణన్‌ను ఎలా ప్రేమిస్తున్నానన్న విషయాన్ని లేఖలో రాసి ఆత్మహత్య చేసుకుంది జ్యోతి. ఆ లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.