శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (17:07 IST)

తమిళనాడులో భారీ పేలుడు, ఏడుగురు దుర్మరణం

తమిళనాడు రాష్ట్రంలో భారీ పేలుడు సంభవించింది. చెన్నై రాజధానికి 190 కిలోమీటర్ల దూరంలో కడలూరు జిల్లాలోని కట్టమన్నార్ కోయిల్ గ్రామంలో ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బాణాసంచా కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.
 
దీపావళికి టపాకాయలను తయారుచేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కడలూరుకు చెందిన నలుగురు మహిళలు.. ముగ్గురు పురుషులు మృతి చెందారు. షార్ట్ షర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
 
ఘటనా స్థలంలో మృతదేహాలు ఛిద్రంగా పడిపోయాయి. మాంసపు ముద్దల్లా ఎగిరి దూరంగా పడ్డాయి. హృదయవిదారకంగా దృశ్యాలు ఉన్నాయి. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.