శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 13 మే 2019 (14:37 IST)

అమాయకపురాలైన భార్యను అందుకోసం వదిలేసిన మోదీ: మాయావతి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో అవసరానుగుణంగా మోడీ తన కులాన్ని మార్చి చెప్పుకుంటున్నారని ఆమె విమర్శించారు.


దళితులను ఆకర్షించేందుకు వారిపై ప్రేమ వున్నట్లు మోదీ నటిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ దళితులపై చూపిస్తున్న ప్రేమ ఒక నాటకం మాత్రమేనని దుయ్యబట్టారు. 
 
ఎన్నినాటకాలాడినా ఫలితం ఉండదని మాయావతి చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం తన భార్యనే వదిలేసిన వ్యక్తి ఇతరుల సోదరీమణులను, భార్యలను ఎలా గౌరవిస్తారని అడిగారు.

రాజకీయాల కోసం.. స్వార్థం కోసం కట్టుకున్న భార్యను వదిలేసిన వ్యక్తి మోదీ అని చెప్పారు. స్వార్థ రాజకీయాల కోసం.. నాయకుడవ్వాలని మోదీ అమాయకమైన భార్యను కూడా వదులుకున్నారని ధ్వజమెత్తారు.