గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 24 జనవరి 2024 (13:15 IST)

హేళన చేయడం మానసిక క్రౌర్యంగా పరిగణించలేం : బాంబే హైకోర్టు

court
ఏ వ్యక్తిని అయినా హేళన (గేలి) చేసినంత మాత్రానదాన్ని మానసికంగా వేధించడంగానే, మానసిక క్రౌర్యంగానో పరిగణించలేమని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం ఓ కీలక తీర్పును వెలువరించింది. పైగా, ఒక మహిళను హేళన చేస్తూ, ఆట పట్టించి, ఆత్మహత్యకు పురిగొల్పారన్న కేసులో పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను హైకోర్టు బెంచ్ విడుదల చేసింది. ఈ ముగ్గురు మృతురాలి భర్త, మరిది, అత్త కావడం గమనార్హం. 
 
గత 1993లో పెళ్లయినప్పటి నుంచి ఆమెకు వంట పని, ఇంటి పని రాదని ఈ ముగ్గురూ వేధించడం వల్లనే 1994 ఏప్రిల్‌లో ఆమె నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారని ప్రాసిక్యూషన్‌ ఆరోపించింది. అత్తింటి వారు రూ.10,000 కట్నం కావాలని ఒత్తిడి చేశారని కూడా కోర్టుకు తెలిపింది. ఒక సెషన్స్‌ కోర్టు 2001లో పై ముగ్గురినీ దోషులుగా తేల్చింది. మృతురాలిని వారే చంపినట్లు, ఆత్మహత్యకు పురిగొల్పినట్లు సాక్ష్యాధారాలు లేవని, కేవలం ఆటపట్టించినంత మాత్రాన మానసిక క్రౌర్యంగా పరిగణించలేమని ఔరంగాబాద్‌ ధర్మాసనం తీర్పు చెప్పింది. 
 
అయోధ్య రాములోడికి అలంకరించిన ఆభరణాల జాబితా ఇదిగో... 
 
అయోధ్యలో నిర్మించిన రామాలయంలో శ్రీరాముడు కొలువుదీరాడు. సోమవారం అంగరంగ వైభవంగా రామ్ లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ట జరిగింది. రాముడుకి వజ్ర, బంగారు ఆభరణాలను అలంకరించారు. ఇపుడు ఈ ఆభణాలపై ప్రత్యేక చర్చ సాగుతుంది. ఆధ్యాత్మ రామాయణం, వాల్మీకి రామాయణంతో పాటు ఇతర శాస్త్రీయ గ్రంథాలను పరిశీలించి ఈ నగలను తయారు చేయడం గమనార్హం. ఈ ఆభరణాలను లక్నోలోని హర్ష హైమల్ షియామ్ లాల్ జ్యూవెలర్స్ తయారు చేసింది. ఈ నగలతో పాటు శ్రీరాముడికి ధరించిన పట్టువస్త్రాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 
 
పసుపు ధోతీ, ఎరుపు రంగ పతాక లేదా అంగవస్త్రంతో రామ్ లల్లాను అలంకరించారు. ఈ అంగ వస్త్రాలను స్వచ్ఛమైన బంగారు జరీ, దారాలతో తయారుచేశారు. ఈ దుస్తులపై శంఖం, పద్మ, చక్రం, మయూర్ వంటి వైష్ణవ చిహ్నాలు ముద్రించి ఉన్నాయి. ఈ వస్త్రాలను అయోధ్య ధామ్‌లో పని చేసిన ఢిల్లీ టెక్స్‌టైల్ డిజైనర్ శ్రీ మనీష్ త్రిపాఠి రూపొందించారు. 
 
దరశరథనందనుడికి ధరించిన ఆభరణాలు ఇవే... 
విజయమాల... బంగారంతో తయారు చేసిన విజయమాలతో రామ్ లల్లాను అలంకరించారు. కెంపులతో పొదిగిన దీనిని విజయానికి చిహ్నంగా ధరిస్తారు. వైష్ణవ సంప్రదాయ చిహ్నాలైన సుదర్శన చక్రం, కమలం, శంఖం, మంగళ కలశం ముద్రించి ఉన్నాయి. 
 
భూబంధ్... 
బల రాముడు రెండు చేతులతో పట్టుకున్న ఆయుధాలు. బంగారం, ఎంతో విలువైన రాళ్లతో ఈ ఆయుధాలను తయారు చేశారు. 
 
కంచ/కర్థాని...
ఇది బలరాముడి నడుము చుట్టూ రత్నాలు పొదిగి ఉన్న నగ. సహజత్వం ఉట్టిపడేలా బంగారంతో దీనిని తయారు చేశారు. వజ్రాలు, కెంపులు, ముత్యాు, పచ్చలతో దీనిని అలంకరించారు. స్వచ్ఛతకు ప్రతీకగా చిన్న గంటలు, ముత్యాలు, కెంపులు, పచ్చలు దీనికి వేలాడుతూ ఉంటాయి. 
 
కంగన్.. 
అందమైన రత్నాలు పొదిగిన గాజులు. వీటిని రామ్ లల్లా రెండు చేతులకు ధరించారు. 
 
ముద్రిక... 
రత్నాలతో అలంకరించిన ఉంగాలు. రెండు చేతులకు వేలాడుతున్న ముత్యాలు. 
 
ఛడ లేదా ఫైంజనియా.. 
బలరాముడి పాదాలు, బొటనవేళ్లను అలంకరించిన ఆభరణాలు. వీటిని బంగారం, వజ్రాలు, కెంపులతో రూపొందించారు. 
 
ఇకపోతే, రామ్ లల్లా ఎడమ చేతిలో ముత్యాలు, కెంపులు, పచ్చలతో అంలకరించిన బంగారు ధనస్సు ఉంది. కుడి చేతిలో బంగారు బాణం ఉంది. మెడ చుట్టూ ప్రత్యేక నగల అలంకారం ఉంది. బాల రాముడి నుదుటిపై వజ్రాలు, కెంపులతో తయారు చేసిన సంప్రదాయక, పవిత్రమైన తిలకాన్ని అద్దారు. 
 
భగవానుడి పాదాల కింద కమలం, దాని కింద బంగారు దండ అమర్చి ఉన్నాయి. రామ్ లల్లా ఐదేళ్ల పిల్లాడు కాబట్టి వెండితో తయారు చేసి సంప్రదాయ బొమ్మలు విగ్రహం ముందు ఉన్నాయి. గిలక్కాయలు, ఏనుగు, గుర్రం, ఒంటె, బొమ్మల బండి, స్పిన్నింగ్ టాప్ వీటిలో ఉన్నాయి. ఇక శ్రీరాముడికి ఒక బంగారు గొడుగును కూడా తలపై అమర్చారు.