శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : సోమవారం, 6 నవంబరు 2023 (11:12 IST)

బాలికలను లైంగికంగా వేధించిన ప్రిన్సిపాల్ అరెస్టు

arrest
తన వద్ద చదువుకునే పలువురు బాలబాలికలను వేధించిన వ్యవహారంలో ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జింద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో గత ఐదు రోజులుగా పరారీలో ఉన్న అతన్ని పోలీసుల ప్రత్యేక బృందం అరెస్టు చేసినట్టు డిప్యూటీ ఎస్పీ అమిత్ కుమార్ భాటియా వెల్లడించారు. అరెస్టు అనంతరం జింద్ జిల్లా కోర్టు ముందు హాజరుపరుస్తామని, తదుపరి విచారణ నిమిత్తం పోలీసుల రిమాండ్‌కు తీసుకుంటామని వెల్లడించారు. 
 
కాగా, ఇటీవల హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ జింద్ జిల్లాల్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 50 మంది విద్యార్థినులపై ప్రిన్సిపాల్ లైంగికంగా వేధిస్తున్నట్టు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాఠశాలలోని 60 మంది విద్యార్థినులు కూడా తమకు లిఖితపూర్వక ఫిర్యాదు అందిందని చెప్పారు. 
 
వారిలో 50 మంది ప్రిన్సిపాల్ వేధిస్తున్నట్టు పేర్కొనగా మరో పది మంది అందుకు సాక్ష్యంగా రాశారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేణు భాటియా వెల్లడించారు. ఫిర్యాదు మేరకు అందరూ మైనర్లేనని రేణు భాటియా తెలిపారు. ఈ ఘటన అనంతరం ప్రభుత్వం ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత పోలీసులు అతనిపై కేసు నమోదు అరెస్టు చేశారు.