1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2020 (23:32 IST)

శ్మశానంలో అరటిపండ్లు.. ఏరుకున్నాం.. కొన్ని రోజులకు అదే ఆహారం

Banana
కరోనా ఎఫెక్టుతో లాక్ డౌన్ కారణంగా కార్మికులు, వలస కూలీలు, పేదల పరిస్థితి దారుణంగా మారింది. పేదలకు ఆహారం దొరకకుండా అలమటిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనే యమునా నదీ తీరాన చోటుచేసుకుంది. ఆహారం లేక ఎండలో అలమటిస్తున్న వలస కూలీలకు శ్మశానంలో పడేసి అరటిపండ్లు ఆహారంగా మారాయి. 
 
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ఎక్కడకు వెళ్లలేని పరిస్థితిలో ఆహారం లేక.. అక్కడ ఉన్న అరటిపండ్లలో మంచి పండ్లను కూలీలు ఏరుకు తిన్న దుస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని నిగమ్‌భోద్ ఘాట్‌లో వున్న శ్మశానంలో ఈ అరటిపండ్లను కొందరు పడేసి వెళ్లారు. దీన్ని ఆ పక్కన ఉంటున్న పలసకూలీలు గమనించి అందులో మంచిగా ఉన్న అరటిపండ్లను ఏరుకోవడం ప్రారంభించారు. 
 
ఉత్తర్‌ప్రదేశ్ ఆలీఘడ్‌కి చెందిన ఓ వ్యక్తి దీని గురించి మాట్లాడుతూ.. ''అవి అరటిపండ్లు.. త్వరగా చెడిపోవు. మంచిగా ఉన్న పండ్లను ఏరుకుంటే.. కొంత సమయం అవి మా కడుపులు నింపుతాయి. మాకు ఆహారం సరిగ్గా లభించడం లేదు. కాబట్టే ఇవి తీసుకుంటున్నాము'' అని తెలిపాడు.