ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 23 జూన్ 2017 (10:12 IST)

బీజేపీ ఎమ్మెల్యే ఫేస్ బుక్ ఖాతాలో అశ్లీల వీడియో.. ఇద్దరు యువకులు అత్యాచారం చేయబోతుండగా?

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇగ్లాస్ బీజేపీ ఎమ్మెల్యే రాజ్ వీర్ దిలేర్ ఫేస్ బుక్ ఖాతాలో అశ్లీల వీడియో కలకలం సృష్టించింది. రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో ఓ యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేయబోతుండగా...

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇగ్లాస్ బీజేపీ ఎమ్మెల్యే రాజ్ వీర్ దిలేర్ ఫేస్ బుక్ ఖాతాలో అశ్లీల వీడియో కలకలం సృష్టించింది. రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో ఓ యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేయబోతుండగా...ఆమె వద్దని వారిని ప్రాధేయపడుతున్నట్లుంది. ఈ వీడియోను చూసిన అనుచరులంతా.. షాక్ అయ్యారు. కొందరు ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అయితే తానీ వీడియోను పోస్ట్ చేయలేదని రాజ్ వీర్ అన్నారు. 
 
తాను వెంటనే ఫేస్‌బుక్ ఖాతాలోని టైమ్‌లైన్ నుంచి అశ్లీల వీడియోను తొలగించి అలీఘడ్ సీనియర్ ఎస్పీ రాజేష్ కుమార్ పాండేను కలిసి దీనిపై ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ కోసం ఢిల్లీ వెళ్ళిన తాను తెల్లవారు జామున రెండున్నర గంటలకే తిరిగి వచ్చానని.. తాను అశ్లీల వీడియోను పోస్టు చేయలేదని ఎమ్మెల్యే రాజ్ వీర్ దిలేర్ చెబుతున్నారు. తనపై రాజకీయ కక్షతోనే ఎవరో తన ఫేస్‌బుక్ ఖాతాను హ్యాకింగ్ చేసి అశ్లీలవీడియో పెట్టారని ఎమ్మెల్యే ఆరోపించారు. దీనిపై కేసు నమోదైంది.