సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 17 ఆగస్టు 2017 (15:12 IST)

తల్లీకూతుళ్లపై అత్యాచారం.. హత్య: ఉరిశిక్ష నిందితుల విడుదల.. ఎలా?

మహారాష్ట్రలో తల్లీకుమార్తె అత్యాచారం, హత్య కేసులో ఉరిశిక్షకు గురైన ఇద్దరు యువకులను ముంబై కోర్టు విడుదల చేసింది. గత 2015వ సంవత్సరం మహారాష్ట్రలోని సోంబా అనే గ్రామంలో నూర్జహాన్ అనే మహిళ, ఆమె 14ఏళ్ల కుమార

మహారాష్ట్రలో తల్లీకుమార్తె అత్యాచారం, హత్య కేసులో ఉరిశిక్షకు గురైన ఇద్దరు యువకులను ముంబై కోర్టు విడుదల చేసింది. గత 2015వ సంవత్సరం మహారాష్ట్రలోని సోంబా అనే గ్రామంలో నూర్జహాన్ అనే మహిళ, ఆమె 14ఏళ్ల కుమార్తె ఇంట్లోనే అనుమానాస్పదంగా హత్యకు గురయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తల్లీకుమార్తెలు అత్యాచారం ఆపై హత్యకు గురైనట్లు పోలీసులు కనిపెట్టారు.
 
దీంతో ఈ కేసుకు సంబంధించి ఆ గ్రామానికి చెందిన కృష్ణ (23), అచ్యుత్ సిన్సే (24)లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును అప్పట్లో విచారించిన కోర్టు వీరికి మరణ శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ యువకులు ముంబై  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. ఈ కేసులో ఆ యువకులిద్దరే నిందితులు అనేందుకు తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో వారిని విడుదల చేయాలని తీర్పు నిచ్చింది.