సోదరుడితో గొడవపడి.. చైనీస్ మొబైల్ ఫోన్ మింగేసిన అమ్మాయి
కొందరు యువతీయువకులు క్షణికావేశంలో ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఓ యువతి క్షణికావేశంలో చైనీస్ మొబైల్ మింగేసింది. ఈ రాష్ట్రంలోని భిండ్ అనే ప్రాంతానికి చెందిన 18 యేళ్ల అను అమ్మాయి ఈ పనికి పాల్పడింది.
మొబైల్ ఫోన్ కోసం తన సోదరుడితో గొడపడింది. ఈ గొడవ వారిద్దరి మధ్య తీవ్ర స్థాయికి చేరింది. దీంతో మనస్తాపం చెందిన అను.. చైనీస్ మొబైల్ ఫోన్‌ను మింగేసింది. ఆ తర్వాత ఆమెకు వాతంలు కావడంతో తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది.
ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన గ్వాలియర్‌లోని జయారోగ్య ఆస్పత్రికి తరలించారు. అక్కడ స్కాన్ తీయగా, ఆమె పొట్టలో మొబైల్ ఫోన్ ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత రెండు గంటల పాటు వైద్యులు శ్రమించి ఆపరేషన్ చేసి మింగేసిన ఫోనును బయటకు తీశారు.