సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 14 జులై 2021 (08:53 IST)

అదానీ చేతికి ముంబై విమానాశ్రయం

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా అదానీ గ్రూప్‌ పరమైంది. ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌  (ఎంఐఏఎల్‌) నిర్వహణలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌  అంతర్జాతీయ విమానాశ్రయంలో జీవీకే గ్రూప్‌న కు ఉన్న 50.5 శాతం వాటాతో పాటు ఎయిర్‌పోర్ట్స్‌ కంపెనీ సౌతాఫ్రికా (ఏసీఎ్‌సఏ), బిడ్‌వెస్ట్‌ గ్రూప్‌ నుంచి 23.5 శాతం వాటాను అదానీ గ్రూప్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ కొనుగోలుకు మంగళవారం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇందుకు అధికారికంగా అనుమతులు లభించాయి. దీంతో ముంబై విమానాశ్రయ యాజమాన్య హక్కులు తమ వశమైనట్టు అదానీ గ్రూప్‌ ప్రకటించింది. ముంబై ఎయిర్‌పోర్టును మరింత అధునాతనంగా తీర్చిదిద్దుతామని అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ ట్వీట్‌ చేశారు. స్థానికంగానూ వేల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

వచ్చే నెల నుంచే నవీ ముంబై అంతర్జాతీయ విమానాశయ్ర నిర్మాణం ప్రారంభించబోతున్నట్టు అదానీ గ్రూప్‌ ప్రకటించింది. 90 రోజుల్లో నిధుల సమీకరణ ప్రణాళిక పూర్తి చేసి 2024 కల్లా నవీ ముంబై  విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెస్తామని తెలిపింది. కాగా ముంబై ఎయిర్‌పోర్టు విక్రయంతో దేశీయ విమానాశ్రయ రంగం నుంచి జీవీకే గ్రూప్‌ పూర్తిగా వైదొలిగినట్లైంది.