శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 14 జులై 2021 (08:32 IST)

2022లో కేంద్ర ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి అర్హత పరీక్ష

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం 2022 ప్రథమార్ధంలో ఉమ్మడి అర్హత పరీక్ష (కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహించనున్నట్లు కేంద్ర సిబ్బంది వెల్లడించారు.

ఈ అర్హత పరీక్ష నిర్వహణ కోసం కేంద్ర కేబినెట్ ఆమోదంతో ఇప్పటికే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం స్టాప్ సెలెక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్లు వేర్వేరుగా నిర్వహిస్తున్న అర్హత పరీక్షలను ఇక మీదట నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీయే నిర్వ హించి గ్రూప్-బి, గ్రూప్-సి (నాన్టెక్నికల్) పోస్టులకు అభ్యర్థుల జాబితా షార్ట్ లిస్ట్) రూపొందిస్తుందని చెప్పారు.

దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక పరీక్ష కేంద్రం ఉంటుందని, అందువల్ల అభ్యర్థులు పరీక్ష రాయడం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని స్పష్టంచేశారు.