బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 డిశెంబరు 2022 (11:27 IST)

ముద్దుపెట్టి ఫోటో తీసుకున్నాడు.. అంతే ఒంటరిగా రమ్మని?

ముంబైలో 17 ఏళ్ల బాలికను ముద్దుపెట్టుకుంటూ ఫొటోలు తీసి ఆపై బెదిరింపులకు గురిచేసి  లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన  సంచలనానికి దారితీసింది. 
 
వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన 17 ఏళ్ల అబ్బాయి, అమ్మాయి కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. తాజాగా ఓ బర్త్‌డే పార్టీలో అమ్మాయిని ముద్దుపెట్టుకున్న అబ్బాయి దాన్ని తన ఫోన్‌లో బంధించాడు. ఆపై ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. 
 
ఇంకా ఒంటరిగా రమ్మని తరచూ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటన జరిగిన రోజు బాలికకు ఫోన్ చేయగా అందుకు అంగీకరించకపోవడంతో బాలుడు బాలికపై దాడి చేశాడు. ఇది చూసిన బాలిక స్నేహితురాలు బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. 
 
బాలిక తల్లిదండ్రులను విచారించగా అసలు విషయం తెలిసింది. పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి ఫిర్యాదు మేరకు బాలుడిని పోక్సో చట్టం కింద నిందితుడిని అరెస్టు చేశారు.