మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 మే 2022 (09:00 IST)

ఢిల్లీ మెట్రో ముండ్కా మెట్రో స్టేషన్‌లో మంటలు: 16మంది మృతి

fire
దేశ రాజధాని ఢిల్లీలోని ముండ్కా మెట్రోస్టేషన్​ దగ్గర ఉన్న భవంతిలో మంటలు చెలరేగాయి. మూడంస్తుల బిల్డింగ్​ మంటలు, పొగతో వ్యాపించడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ప్రమాద ఘటనలో 16 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. చాలామంది గాయపడ్డారు. 
 
కాగా, ఫైర్​ ఇంజిన్లు తరలివచ్చి మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ బిల్డింగ్​లో దాదాపు 60 మందికి పైగా ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా వుందని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందంటున్నారు అధికారులు. 
 
అలాగే మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇకపోతే.. ముండ్కా మెట్రోస్టేషన్​ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.