ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 మే 2022 (16:28 IST)

ట్రాలీ బ్యాగ్స్‌లో 62 కిలోల హెరాయిన్‌.. ఢిల్లీలో పట్టివేత

62 కిలోల హెరాయిన్‌ను ఢిల్లీ ఎయిర్ పోర్టులో డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హెరాయిన్ విలువ రూ.434 కోట్లని అధికారులు చెప్తున్నారు. 
 
భార‌త్‌లో కొరియ‌ర్‌, కార్గో, ఎయిర్ ప్యాసెంజ‌ర్ మార్గాల్లో హెరాయిన్‌ను భారీస్ధాయిలో సీజ్ చేయ‌డం ఇదే తొలిసార‌ని ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.
 
ట్రాలీ బ్యాగ్స్‌లో మాద‌క ద్ర‌వ్యాల‌ను నింపి అధికారుల కండ్లు కప్పి దేశంలోకి త‌ర‌లించేందుకు డ్ర‌గ్ మాఫియా ఆగ‌డాల‌ను డీఆర్ఐ సిబ్బంది భ‌గ్నం చేసింది. 
 
ఈ దాడుల్లో రాబట్టిన స‌మాచారం ఆధారంగా పంజాబ్‌, హ‌ర్యానా రాష్ట్రాల్లోనూ మ‌రో ఏడు కిలో హెరాయిన్ రూ.50 ల‌క్ష‌ల న‌గ‌దు ప‌ట్టుబడింది. 
 
ఇక క‌న్‌సైన్‌మెంట్ దిగుమ‌తిదారును డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసు న‌మోదు చేసిన అధికారులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.