శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (10:24 IST)

గుజరాత్ కాండ్లా ఓడ రేవులో రూ.1300 కోట్ల హెరాయిన్ పట్టివేత

గుజరాత్ రాష్ట్రంలోని కాండ్లా ఓడరేవు డ్రగ్స్ అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. ఈ ఓడరేవులో మరోమారు డ్రగ్స్ కలకలం రేపింది. ఈ రాష్ట్రంలోని కచ్ జిల్లాలోని కాండ్లా ఓడ రేవులో 260 కేజీల హెరాయిన్‌ను గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మొత్తం రూ.1300 కోట్ల మేరకు ఉంటుంది డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. 
 
కాగా, ఈ డ్రగ్స్ ఆప్ఘనిస్థాన్ నుంచి ఇరాన్ మీదుగా కంటెయినర్లలో కాండ్లా ఓడరేవుకు చేరుకుంది. ఏటీఎస్, డీఆర్ఐ అధికారులు సంయుక్తంగా చేపట్టిన చేసిన దాడుల్లో ఈ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని కంటెయినర్లలో హెరాయిన్ ఉండొచ్చన్న అనుమానంతో వాటిని కూడా స్వాధీనం చేసుకుని తనిఖీలు చేస్తున్నారు.