ఆదివారం, 10 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 11 మే 2022 (17:49 IST)

వ‌రంగ‌ల్‌లో నాగ‌చైత‌న్య సంద‌డి

Nagachaitanya at Warangal
Nagachaitanya at Warangal
అక్కినేని నాగ‌చైత‌న్య ఈరోజు వ‌రంగ్‌ల్లో ప‌ర్య‌టించారు. ఒక వ్యాపార ప్ర‌క‌ట‌న నిమిత్తం ఆయ‌న అక్క‌డ‌కు విచ్చేశారు. ఆయ‌న రాక సంద‌ర్భంగా అభిమానులు సంద‌డి చేశారు. వరంగ‌ల్ ప‌ట్ట‌ణంలో ఈనెల 11న వ‌ర్ణం షాపింగ్‌మాల్‌కు వ‌స్తున్నాం అంటూ అభిమానుల‌నుద్దేశించి సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌టించిన నాగ‌చైత‌న్య‌కు బుధ‌వారంనాడు నాగ‌చైత‌న్య‌కు ఆర్భాటంగా ఆహ్వానం ప‌లికారు. 
 
ఈ సంద‌ర్భంగా చైతు తెల్ల‌టి ష‌ర్ట్‌తో మిల‌ట్రీ గెట‌ప్‌లో వ‌చ్చారు. తాజాగా ఆయ‌న బాలీవుడ్ మూవీ లాల్‌సింగ్‌చద్దాలో న‌టించారు. ఈ గెట‌ప్ చూసిన అభిమానులు ఆనందంతో కేరింత‌లు కొట్టారు. వారి ఉత్సాహాన్ని చూసిన చైతు మాట్లాడుతూ, వ‌రంగల్‌కు వ‌స్తున్నాన‌ని తెలిసి కార్య‌క్ర‌మానికి స‌క్సెస్ చేశారు. అందుకు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నా. ఎప్ప‌డు సినిమా రిలీజ్ అయినా  మీ నుంచి వ‌చ్చే ప్రేమ ఆద‌ర‌ణ నాకు వుంటూనే వుంటుంది. మీ ప్రేమ మ‌రింత‌గా అందిస్తార‌ని ఆశిస్తున్నాను. ఐల‌వ్‌యు. ఆల్‌.. ప్ల‌యింగ్ కిస్ ఇచ్చారు.