శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

టీఎస్సీఓ గోదాములో భారీ అగ్నిప్రమాదం - రూ.లక్షల ఆస్తి నష్టం

fire accident
తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం (టీఎస్సీఓ) గోదాములో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వరంగసల్ జిల్లాలోలని ధర్మారం గ్రామంలో ఈ గిడ్డంగి వుంది. ఈ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గోదాములో ఉన్న స్కూలు విద్యార్థుల యూనిఫామ్స్, చీరలు, కాటన్ దుప్పట్లు, ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతైంది. 
 
ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ.38 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు నివేదికలు పేర్కొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.