మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2023 (09:34 IST)

భారతదేశ యువత వారానికి 70 గంటలు పని చేయాలి : 'ఇన్ఫోసిస్' నారాయణ మూర్తి

info narayana murthy
భారతదేశ యువత వారానికి 70 గంటల పాటు పని చేయాలని 'ఇన్ఫోసిస్' సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి పిలుపునిచ్చారు. ఇతర దేశాలతో పోటీపడేందుకు భారతదేశ పని సంస్కృతిలో తక్షణ మార్పులు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
'3వన్4 క్యాపిటల్ తొలి పాడ్‌కాస్ట్ ది రికార్డ్' అనే ఎపిసోడ్‌లో నారాయణ మూర్తి పాల్గొని మాట్లాడుతూ, ఇతర దేశాలతో సమానంగా భారత్ అభివృద్ధి సాధించాలంటే భారతదేశ పని సంస్కృతిలో తక్షణ మార్పులు రావాలని కోరారు. యుతవ కష్టపడేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. వారానికి 70 గంటల పాటు పని చేయాలని ఆయన సూచించారు. 
 
ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువగా ఉందని నారాయణ మూర్తి తెలిపారు. రెండే ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ దేశాలు తమ పని సంస్కృతిలో మార్పులు చేసుకున్నాయని, యువత అధిక సమయం పనికి కేటాయించేలా ప్రోత్సహించాయని ఆయన గుర్తు చేశారు. చైనా వంటి దేశాలతో పోటీపడేందుకు ఇది అవసరమని ఆయన చెప్పారు. "ఇది నా దేశం. నా దేశం కోసం వారానికి 70 గంటలు కష్టపడతాను" అని యువత ప్రతిజ్ఞ చేయాలని ఆయన సూచించారు.