శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 16 నవంబరు 2017 (13:30 IST)

ఇండియాస్ మోస్ట్ పాపులర్ పొలిటికల్ లీడర్ ఎవరంటే?

భారత్‌లో మోస్ట్ పాపులర్ రాజకీయ నేత ఎవరు.? భారతదేశంలోని 100 కోట్ల మందిని ప్రభావితం చేస్తున్న రాజకీయ నేత ఎవరు అనే అంశంపై అగ్రదేశం అమెరికాకు చెందిన ఓ సంస్థ ఓ సర్వే నిర్వహించింది.

భారత్‌లో మోస్ట్ పాపులర్ రాజకీయ నేత ఎవరు.? భారతదేశంలోని 100 కోట్ల మందిని ప్రభావితం చేస్తున్న రాజకీయ నేత ఎవరు అనే అంశంపై అగ్రదేశం అమెరికాకు చెందిన ఓ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మరోమాటకు తావులేకుండా మోడీ అంటూ సమాధానమిచ్చారట. ఈ సర్వే కోసం 100 కోట్ల మందిలో 2464 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఈ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి.
 
దేశంలో మోస్ట్ పాపులర్ పొలిటికల్ లీడర్ ఎవరు అంటే ప్రధానమంత్రి మోడీ అని 88 శాతం మంది చెప్పగా, 58 శాతం మంది రాహుల్ గాంధీ పేరును, 57 శాతం మంది సోనియా గాంధీ పేరును చెప్పారట. ఆ తర్వాత కేజ్రీవాల్ 39 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు.
 
ఈ యేడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10వ తేదీ మధ్య ఈ అభిప్రాయ సేకరణ జరిగింది. పియూ సంస్థ వివిధ రాష్ట్రాల్లోని అభిప్రాయాలను కూడా వెల్లడించింది. నార్త్‌లో మోడీ హవా చెక్కుచెదరలేదు. సౌత్‌లో మాత్రం పాపులారిటీ పెరిగింది. మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్‌ఘడ్, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రతి 10 మందిలో తొమ్మిది మంది మోడీ విధానాలను స్వాగతిస్తున్నారు.
 
ఇక ఉత్తర భారతంలోని బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతి 10 మందిలో 8 మంది మోడీకి అనుకూలంగా ఉన్నారు. మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత నార్త్ కంటే.. సౌత్‌లోనే ఆయన పాపులారిటీ పెరగటం విశేషం.