శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 9 నవంబరు 2019 (15:41 IST)

బీజేపీ చంకలు గుద్దుకోనవసరం లేదు : ఉద్ధవ్ ఠాక్రే

వివాదాస్పద అయోధ్య కేసులో సుప్రీంకోర్టు శనివారం తుది తీర్పును వెలువరించింది. ఈ తీర్పులో వివాదాస్పదంగా ఉన్న 2.77 ఎకరాల స్థలాన్ని రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. 
 
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రామ మందిరం నిర్మాణానికి అనుకూలంగా ఉన్నప్పటికీ అదేదో తమ ఘనతగా భారతీయ జనతా పార్టీ చంకలు గుద్దుకోనవసరం లేదని అన్నారు. కేంద్రంపై పూర్తిస్థాయి విశ్వాసం కోర్టుకు ఉండి ఉంటే ప్రత్యేక ట్రస్టు ఏర్పాటుచేసి స్థలాన్ని దానికి అప్పగించాలని ఎందుకు కోరుతుందని ప్రశ్నించారు.
 
రామమందిర నిర్మాణానికి ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలని తాము ఎప్పుడో డిమాండ్ చేశామనీ, కానీ కేంద్రం దాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం కూడా నిర్మాణ బాధ్యతలను ప్రత్యేక ట్రస్టుకే అప్పగించిందని గుర్తు చేశారు. అందువల్ల తీర్పు తమ ఘనతగా బీజేపీ చెప్పుకోరాదన్నారు.