శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (11:00 IST)

నీట్ మార్గదర్శకాలు.. మాస్కులను చెత్తబుట్టలో పడేసి...?

నీట్ పరీక్షలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1.15 నుంచి పరీక్షా కేంద్రం లోపలికి విద్యార్థులను అనుమతిస్తారు.

మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత వచ్చిన విద్యార్థులను అనుమతించరు. విద్యార్థులు తమ అడ్మిట్‌ కార్డులను ఇన్విజిలేటర్లకు చూపించాలి. గుర్తింపుకార్డు, పాస్‌‌పోర్ట్ సైజ్ ఫొటో తెచ్చుకోవాలి.
 
విద్యార్థులు మాస్కు, శానిటైజర్‌ తెచ్చుకోవాలి. చేతులకు గ్లౌజ్‌లను ధరించాలి. పరీక్ష కేంద్రం లోపలికి వెళ్లగానే విద్యార్థులు తాము తెచ్చుకున్న మాస్కులను చెత్తబుట్టలో పడేసి. నీట్‌ సిబ్బంది ఇచ్చే మాస్కులను ధరించాలి. 
 
దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒక గదిలో 12మంది మాత్రమే ఉంటారు. పరీక్ష అనంతరం విద్యార్థులు ఇన్విజిలేటర్‌కు ఇచ్చే సమాధాన పత్రం, హాల్‌ టికెట్లను మూడు రోజుల తర్వాత తెరువాలని ఎన్టీఏ మార్గదర్శకాల్లో పేర్కొంది.